కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు | Cognizant to hire 20000 freshers in 2025 | Sakshi
Sakshi News home page

కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు

May 2 2025 7:08 AM | Updated on May 2 2025 8:46 AM

Cognizant to hire 20000 freshers in 2025

అమెరికన్‌ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, మేనేజ్డ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.

‘ఇన్వెస్టర్‌ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.

ఈ ఏడాది జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్‌ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement