హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌ మృతి | Veteran Congress leader Girija Vyas dies at 79 | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూత

May 2 2025 8:20 AM | Updated on May 2 2025 11:14 AM

Veteran Congress leader Girija Vyas dies at 79

జైపూర్‌: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్‌ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన‌ గిరిజా వ్యాస్‌ చికిత్స పొందుతూ శుక్ర‌వారం మరణించారు. 

సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) మార్చి 31న‌ అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు.  

ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్‌ సోదరుడు గోపాల్‌ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్‌ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్‌ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

👉 ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.

  • 1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు

  • 1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 

  • 1996, 1999లో ఉదయపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్‌గఢ్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నిక‌య్యారు.

  • కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement