Girija Vyas
-
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైన గిరిజా వ్యాస్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) మార్చి 31న అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉 ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్‌గఢ్ నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు. -
Girija Vyas : హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలు
జైపూర్: సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. पूर्व केन्द्रीय मंत्री डॉ. गिरिजा व्यास जी के आग से झुलसकर घायल होने का समाचार चिंताजनक है। मैं ईश्वर से उनके जल्द स्वास्थ्य लाभ की प्रार्थना करता हूं।— Ashok Gehlot (@ashokgehlot51) March 31, 2025 గిరిజా వ్యాస్ అగ్నిప్రమాదానికి గురయ్యారన్న వార్తలపై రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ స్పందించారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ అగ్ని ప్రమాదంలో గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి,2009లో చిత్తోరగఘ్ నుండి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారుకేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు. -
యువతి ఫోన్ ట్యాప్ చేయించిన మోడీ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉండే అర్హత నరేంద్ర మోడీకి లేదని కాంగ్రెస్ మహిళా నేతలు అన్నారు. గుజరాత్లో ఓ మహిళా ఆర్కిటెక్ ఫోన్‌ను చట్టవిరుద్ధంగా మోడీ ట్యాప్ చేయించారని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2009లో అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా, ఓ ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కోబ్రా పోస్ట్, గులైల్ ఇన్వెస్టిగేటివ్ పోర్టల్‌లు ఈ నెల 15న బయటపెట్టాయి. నరేంద్ర మోడీయే తన అనుచరుడు అమిత్ షాతో ఇదంతా చేయించారని కేంద్ర మంత్రులు జయంతి నటరాజన్, గిరిజా వ్యాస్, యూపీసీసీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా ఆరోపించారు. మహిళా గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించిన మోడీపై సుప్రీంకోర్టు జడ్డితో విచారణ జరిపించాలన్నారు. ఆ యువతి వ్యక్తి స్వేచ్ఛను ఎందుకు హరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గుజరాత్‌ను పాలించే నైతిక, రాజకీయ అర్హత ఆయన కోల్పోయారని పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ అనర్హుడన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులపై రికార్డు నిర్వహించడానికి, వాటి లీజు గడువును 30 ఏళ్లకు పొడిగించడానికి ఉద్దేశించినవక్ఫ్ సవరణ బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. దీనిని ఆగస్టు 20న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వరకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ సవరణ బిల్లు-2010 ద్వారా వక్ఫ్ ఆస్తులను వాణిజ్యపరంగా సరైన క్రమంలో ఉపయోగించడం ద్వారా అధిక ఆదాయం సమకూరుతుందని మెనార్టీ వ్యవహారాల మంత్రి రహ్మాన్ ఖాన్ చెప్పారు. వీధి వ్యాపారుల రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం: పట్టణాల్లోని వీధి వ్యాపారుల హక్కుల రక్షణకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు పోలీసులు, ఇతర అధికారుల వేధింపుల నుంచి వారికి రక్షణ కల్పిస్తుంది. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ, వీధి వ్యాపారాల క్రమబద్ధీకరణ బిల్లును గృహనిర్మాణ, పట్టణ దారిద్య్ర నిర్మూలన శాఖ మంత్రి గిరిజా వ్యాస్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ధ్రువీకరణ పత్రాలున్న వీధి వ్యాపారులను పోలీ సులు లేదా ఇతర అధికారులెవరైనా తొలగించలేరన్నారు. యాభయ్యేళ్లకు పైగా ఉన్న మార్కెట్లను సహజమైన మార్కెట్లుగా పరిగణించడంతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకునే వారి హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెచ్చినట్లు చెప్పారు. భూసేకరణ బిల్లుకు పార్లమెంటు పచ్చజెండా: చరిత్రాత్మక భూసేకరణ బిల్లుకు గురువారం పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లు గతవారమే లోక్‌సభలో పాస్ అయినప్పటికీ రాజ్యసభలో ఆమోదం సందర్భంగా బుధవారం పలు సవరణలు చేశారు. రాజ్యసభలో బిల్లుకు చేసిన సవరణలకు మళ్లీ లోక్‌సభలోనూ గురువారం ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లును రాష్ట్రపతికి పంపనున్నారు.