ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. పాక్‌తో సంబంధాలపై ఆరా | NIA Conducts Searches at 15 Locations in 8 States | Sakshi
Sakshi News home page

ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. పాక్‌తో సంబంధాలపై ఆరా

Jun 1 2025 8:28 AM | Updated on Jun 1 2025 8:43 AM

NIA Conducts Searches at 15 Locations in 8 States

న్యూఢిల్లీ: ‘పహల్గామ్‌’ ఘటన అనంతరం ప్రభుత్వం పాకిస్తాన్‌ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(National Investigation Agency)(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించింది. ఇవి దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లోని 15 ప్రదేశాల్లో కొనసాగాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర (ముంబై), హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో పాకిస్తాన్ నిఘా సంస్థ (పీఐవో)లతో సంబంధాలున్న అనుమానితుల ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్‌ఐఏ బృందాలు పలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఆర్థిక లావాదేవీల పత్రాలతో పాటు  పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్‌కు సహకరిస్తున్న వారు నిర్వహిస్తున్న గూఢచర్య రాకెట్‌కు సంబంధించిన ఆధారాల కోసం వీటిని సేకరించారు.

ఎన్‌ఐఏ తెలిపిన వివరాల ప్రకారం అనుమానితులకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని తేలింది. వారు పాక్‌ తరపున గూఢచర్య కార్యకలాపాలు సాగించారని వెల్లడయ్యింది. 2023 నుండి పాకిస్తాన్  అధికారులతో  కీలక సమాచారాన్ని పంచుకుంటున్న నిందితుడిని ఎన్‌ఐఏ మే 20న అరెస్టు చేసింది. ఇతను జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేస్తూ, దినికి బదులుగా పాక్‌ నుంచి నిధులు  అందుకున్నాడనే అనుమానాలున్నాయి. ఈ కేసుపై ఉగ్రవాద నిరోధక సంస్థ తన దర్యాప్తును కొనసాగిస్తోంది.

ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే..
 

Advertisement
 
Advertisement
Advertisement