బకాసుర రెస్టారెంట్‌లో వినోదం | Bhakasaura Restaurant Movie First Look Released | Sakshi
Sakshi News home page

బకాసుర రెస్టారెంట్‌లో వినోదం

May 3 2025 12:36 AM | Updated on May 3 2025 12:36 AM

Bhakasaura Restaurant Movie First Look Released

హాస్య నటుడు ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’(Bhakasaura Restaurant). ఈ సినిమా ద్వారా ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్‌ ఫణి, ‘కేజీఎఫ్‌’ గరుడరామ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఎస్‌జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘బకాసుర రెస్టారెంట్‌’ రూపొందింది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రవీణ్‌లోని మరో కోణాన్ని చూపిస్తుంది’’ అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement