ప్రభాస్‌ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత | Producer Bhushan Kumar Drops Big Update On Prabhas Spirit Movie | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన ‘స్పిరిట్‌’ నిర్మాత!

May 2 2025 9:59 AM | Updated on May 2 2025 11:26 AM

Producer Bhushan Kumar Drops Big Update On Prabhas Spirit Movie

‘రాజాసాబ్‌’తర్వాత ప్రభాస్‌(Prabhas) నటించబోయే సినిమా ఏంటి? అనేదానిపై రకరకాల చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ స్పిరిట్‌(Spirit) సినిమా చేయాల్సింది. ఈ మేరకు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా పనులు కూడా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్‌ మనసు మార్చుకున్నాడని, స్పిరిట్‌ని పక్కకు పెట్టి ప్రశాంత్‌ వర్మతో సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అలాగే సందీప్‌ రెడ్డి వంగా కూడా స్పిరిట్‌ కంటే ముందే ‘యానిమల్‌’ సీక్వెల్‌ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్పిరిట్‌ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్‌’ చేసిన తర్వాతనే ‘యానిమల్‌ పార్క్‌’ తెరకెక్కిస్తాడని చెప్పాడు. మరో రెండు మూడు నెలల్లో ‘స్పిరిట్‌’ షూటింగ్‌ ప్రారంభం కానుందన్నారు. 2027లో  ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. భూషన్‌ కుమార్‌ ప్రకటనతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

కాగా, ప్రభాస్‌ ప్రస్తుతం ఇటలీలో టూర్‌లో ఉన్నాడు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత రాజాసాబ్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత భూషన్‌ చెప్పినట్లుగా స్పిరిట్‌ చేస్తారు. సందీప్‌ కోరిక మేరకు ఈ సినిమా కోసం ప్రభాస్‌ వరుసగా 65 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట.

ఈ మూవీ తర్వాత హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’(ప్రచారంలో ఉన్న టైటిల్‌) షూటింగ్‌లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం స్పిరిట్‌, పౌజీతో పాటు ప్రశాంత్‌ వర్మ సినిమా కూడా ఉంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌ 2, నాగ్‌ అశ్విన్‌తో ‘కల్కి 2’ చేయాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement