ఇండియన్ సినిమాలోనే నటి త్రిష ఒక సంచలనం. హీరోయిన్‌గా రెండు దశాబ్దాలకు పైగా పయనం, ఎన్నో విజయాలు. కొన్ని అపజయాలు. వ్యక్తిగతంగానూ సంతోషంతో పాటు చేధు అనుభవాలు ఎదుర్కొన్నారు. అయితే చేదు అనుభవాలను ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. ఎంతటి వారికైనా జీవితంలో ఎత్తుపల్లాలు సహజం అనడానికి త్రిష ఒక చిన్న ఉదాహరణ. నటి సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడీ చిత్రంతో ఆమె స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివవేశాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఆ తరువాత హీరోయిన్ స్థాయికి ఎదిగి ఇప్పటి వరకు అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ సీనీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
గత ఏడాది ఆమె నటించిన చిత్రాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఒక్కటే విజయం సాధించింది. దీంతో కెరీర్ పరంగా కొంచెం ఒడిదుకులను ఎదుర్కొన్నా.. ఈ ఏడాది ఆరంభంలోనే కరుప్పు చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. 44 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువతిలా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇక పోతే తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఒక భేటీలో త్రిష పేర్కొంటూ ఆరంభంలో మిస్ చెన్నై కీరిటాన్నిగెలుకున్న తాను మోడలింగ్ రంగంలోకి ఎంట్రి ఇచ్చానన్నారు. అప్పట్లో చాలా మంది సినీ రంగంలోకిప్రవేశిస్తారా అని అడగ్గా..ఎప్పటికీ అలా చేయనని అని దృఢంగా చెప్పానన్నారు. సినిమా అంటే తెలిసీ తెలియని వయసు అది అని నటి త్రిష పేర్కొన్నారు. ఈ సంచనల నటి ఆరంభంలో చెప్పినట్లుగా సినిమాకు దూరంగా ఉండి ఉంటే ఇండియన్ సినిమా ఒక మంచి నటిని కోల్పోయేది అని నెటిజన్స్ కామెంట్ చేస్తుననారు.


