తమిళనాడు: సేలం జిల్లాలోని ఆత్తూరు సమీపంలో ఉన్న పుదుకోతమ్మడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు ఆమె సెల్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆత్తూరు తాలూకా కార్యాలయం నుండి తహసీల్దార్ అని చెప్పుకుంటూ, ఆ మహిళ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా అడిగారు. కరోనా వంటి కొత్త వ్యాధులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాలలో ప్రజలు గుండు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుండి తప్పించుకుంటున్నారు.
ఈ విధంగా గుండు చేయించుకుంటే, వారికి ఈ వ్యాధి సోకదు. ప్రభుత్వం కూడా రూ. 15 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. దీనిని నమ్మి 20 మంది గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసమని గ్రహించి మిగిలిన వారు గుండు చేయించుకోకుండా జాగ్రత్తపడ్డారు. కాగా కొత్త పద్ధతిలో మహిళలను మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు పోలీసులను కోరారు.


