సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమని , ఎమ్మెల్యే సౌమ్య మంత్రి కానున్నారన్న చర్చ ఊపందుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలోకి నలుగురు ఎమ్మెల్యేల్ని కలిగిన పీఎంకే చేరబోతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.
టీవీకేతో ఇటీవల కాలంలో పీఎంకే సన్నిహితంగా ఉంటూ వస్తోంది. తాజాగా పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతలు, అధికారాలు అన్బుమణికి ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు అప్పగించేశారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడేందుకు పీఎంకే సిద్ధమవుతున్నట్టు చర్చ ఊపందుకుంది. అదే సమయంలో సౌమ్య అన్బుమనికి మంత్రి పదవి అప్పగించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం సీఎం విజయ్ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు ఇప్పటికే చర్చజోరుగా సాగుతుండటం గమనార్హం.


