బాబుషాన్‌ బర్త్‌డే స్పెషల్‌..ఆకట్టుకుంటున్న‘అంతర్యామి' పోస్టర్‌ | Odia Superstar Babushan Birthday Special First Look Poster Released From Antaryami Movie, Photo Went Viral | Sakshi
Sakshi News home page

బాబుషాన్‌ బర్త్‌డే స్పెషల్‌..ఆకట్టుకుంటున్న‘అంతర్యామి' పోస్టర్‌

Jul 30 2026 2:33 PM | Updated on Jul 30 2026 2:50 PM

Babushan Birthday Special Poster Released From Antaryami

ఒడియా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూపర్‌స్టార్ బాబుషాన్ మొహంతి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అంతర్యామి' చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. 

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ విడుదల చేసిన బర్త్‌డే పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అమ్రిత్ ప్రెజెంట్స్, శివ సత్యం ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాబుషాన్ మొహంతి కథానాయకుడిగా నటిస్తుండగా, వేద్విక సోని హీరోయిన్‌గా కనిపించనుంది. 

సీనియర్ నటీమణులు ఆమని, కస్తూరి, శ్రీతం దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శివ సత్యం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్  అమ్రిత్ నిషాద్  జ్ఞానరంజన్ సాహు, నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను చిత్రబృందం వెల్లడించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement