కశ్మీర్‌లో భారత ఆర్మీ వేట.. లష్కర్‌ టాప్‌ కమాండర్‌ హతం | Lashkar Top Commander Altaf Lalli dead In Bandipora | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భారత ఆర్మీ వేట.. లష్కర్‌-ఏ-తోయిబా టాప్‌ కమాండర్‌ హతం

Apr 25 2025 11:08 AM | Updated on Apr 25 2025 11:27 AM

Lashkar Top Commander Altaf Lalli dead In Bandipora

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బందిపొరాలో ఎన్‌కౌంటర్‌లో భాగంగా లష్కర్‌-ఏ-తోయిబా టాప్‌ కమాండర్‌ను భద్రతా బలగాలు హతమార్చాయి.

వివరాల ప్రకారం.. బందిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య గురువారం రాత్రి నుంచే ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌-ఏ-తోయిబా టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లీని భద్రతా బలగాలు హతమార్చాయి. ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement