Punjab: నడిరోడ్డుపై ఎల్‌పీజీ ట్యాంకర్‌ దగ్ధం.. ఇద్దరు మృతి | Punjab LPG Tanker Following Road Accident 2 Killed, More Details | Sakshi
Sakshi News home page

Punjab: నడిరోడ్డుపై ఎల్‌పీజీ ట్యాంకర్‌ దగ్ధం.. ఇద్దరు మృతి

Aug 23 2025 9:05 AM | Updated on Aug 23 2025 10:14 AM

Punjab lpg Tanker Following Road Accident 2 Killed

హోషియార్‌పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో దడపుట్టించే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మాండియాలా గ్రామంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. రోడ్డు ప్రమాదం అనంతరం గ్యాస్‌ ట్యాంకర్‌కు మంటలు అంటుకోగా, అవి సమీపంలోని 15 దుకాణాలను, ఐదు నివాస గృహాలను  దగ్ధం చేశాయని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
 

శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ కమిషనర్ జైన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ మాలిక్ సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు అంబులెన్స్‌లలో తరలించారు. హోషియార్‌పూర్ డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ మీడియాతో మాట్లాడుతూ ‘రోడ్డు ప్రమాదం కారణంగా గ్యాస్‌ ట్యాంకర్‌ నుంచి మంటలు చెలరేగాయి. ప్రమద బాధితులను ఆస్పత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదం తర్వాత గ్యాస్ లీక్ అయ్యిందని తెలిపారు.
 

ఘటనా స్థలానికి పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ చేరుకుని, పరిస్థితులను, సహాయక చర్యలను పరిశీలించారు. ‘పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది. చాలా విషాదకరమైన ప్రమాదం జరిగింది. ఎంత మంది గల్లంతయ్యారో ఇంకా తెలియదు. ఒక ట్యాంకర్.. కారును ఢీకొంది. ఆ తర్వాత గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి’ అని మీడియాకు తెలిపారు. కాగా ప్రమాద బాధితులను హోషియార్‌పూర్ సివిల్ ఆసుపత్రికి తరలించేలోపే  ఇద్దరు మృతిచెందారని, మరో 20 మంది వరకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సివిల్ సర్జన్ పవన్ కుమార్  తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement