
గుర్గావ్: సీనియర్ అధికారుల వేధింపుల వల్లే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నానని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న హర్యానాకు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రాసిన సూసైడ్ నోట్‌లో బహిర్గతమైంది. ఈ మేరకు పూరన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్ రాశారు.
నిన్న(మంగళవారం, అక్టోబర్ 7) పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడగా, తాజాగా సదరు అధికారి రాసిన సుదీర్ఘ సూసైడ్ నోట్ బయటకొచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారులు తమ దర్యాప్తులో కనుగొన్నారు.
పూరన్ కుమార్ సన్నిహితుడైన సుశీల్ కుమార్ అనే వ్యక్తి సదరు ఆఫీసర్ పేరు మీద లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదురై రోహతక్ పోలీసులు.. సోమవారం నాడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పలువురు పైస్థాయి అధికారులు మానసిక వేధింపుల కారణంగానే పూరన్ కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు. పూరన్ కుమార్ స
కుమార్ సహాయకుడు డ తన పేరు మీద రూ. 2.5 లక్షలు లంచం అడిగినట్లు మద్యం కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా రోహ్‌తక్ పోలీసులు సోమవారం ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు.
అయితే ఈ క్రమంలోనే సుశీల్‌ను అరెస్ట్ చేయగా, పూరన్ కుమార్ పేరు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆపీసర్ పూరన్ పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అయితే ఇది సీనియర్ అధికారుల తనను వేధింపులకు గురి చేయడంలో భాగంగానే జరిగిందని, తన ప్రొఫెషనల్ కెరీర్‌ను నాశనం చేయడానికి ఇలా చేశారని సూసైడ్ నోట్ రాసిన పూరన్ కుమార్ ఆపై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో 10 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు పేర్లు రాసి పెట్టాడు పూరన్ కుమార్.
కాగా, హర్యానా కేడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలోనే సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
పురాణ్ ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలా? మరేదైనా ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆయన మొబైల్ ఫోన్‌తో పాటు వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా, నిజాయితీ, నిబద్ధత గల అధికారిగా పురాణ్‌కు పోలీస్ శాఖలో మంచి పేరుంది. అలాంటి వ్యక్తి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) హోదాలో పురాణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా హర్యానా పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్నారు. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి కుమార్ కూడా ఆ రాష్ట్ర కేడర్‌లోనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె విధుల్లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. భర్త మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. భారత్‌కు పయనమయ్యారు.
ఇద్దరు జవాన్లు అదృశ్యం.. ఇది ఉగ్రవాదుల పనేనా?