ఆధ్యాత్మిక గురువు, డేరా స్వచ్ఛ సౌధా ఛీప్ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరోసారి పెరోల్ మంజూరయ్యింది. దీంతో ఆయన 40 రోజుల పాటు సాధారణ జీవితం గడపనున్నారు. ఈ పెరోల్ కాలంలో గుర్మిత్ బాబా సిర్సా హెడ్‌క్వార్టర్స్‌లో ఉండనున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.
గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు హర్యాణాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడే కాకుండా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాలలో సైతం ఆయనకు భక్తులు ఉన్నారు. డేరాబాబా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవ తదితర వాటి రీత్యా ఆయనపై ప్రజలకు అభిమానం అధికంగా ఉండేది. అయితే 2017లో ఆశ్రమానికి చెందిన ఇద్దరు మహిళలపై డేరాబాబా లైంగికదాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశం విచారించిన కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ 20 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు అయ్యారు.
కాగా 2017లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకూ ఆయన దాదాపు 15సార్లు పెరోల్‌పై వచ్చారని నివేదికలు తెలుపుతున్నాయి. 2025లో జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు నెలలలో ,2024లో మూడు సార్లు ఫెరోల్‌పై బయిటకి వచ్చినట్లు పేర్కొన్నాయి. ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు డేరాబాబా ఫెరోల్‌పై బయిటకు వచ్చారు. 2002లో జరిగిన జర్నలిస్టు హత్య కేసులో సైతం డేరాబాబా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.


