మహబూబ్ నగర్ జిల్లా: మండలంలోని నసురుల్లాబాద్ సమీపంలో పొలం వద్ద రైతు కావలి యాదయ్య ఇల్లు ఉంది. శనివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర్లో పాము కనిపించడంతో సర్పరక్షకుడు సదాశివయ్యకు సమాచారమిచ్చారు. ఆయన తన శిష్యులైన రవీందర్, భరత్‌ను పంపగా వారు బండకింద ఉన్న పామును బయటకు తీసేందుకు యత్నిస్తుండగా.. ఒకటి తర్వాత మరొకటి మొత్తం 7 పాములు బయటపడ్డాయి.
బయటపడ్డ పాములు వాన కోయిల (బాండెడ్ రేసర్)లని.. ఆర్ఘోరోజైస్ ఫెసియోలేట శాస్త్రీయనామం గల ఈ పాములు కొలుబ్రిడే కుటుంబానికి చెందినవని, విష రహితమని సర్పరక్షకుడు తెలిపారు. ఈ జాతి పాములు సాధారణంగా ఒకటి, రెండు మాత్రమే కలిసి ఉంటాయని.. అంతకంటే ఎక్కువ ఉండటం అరుదన్నారు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒకే ప్రదేశంలో ఉండే అవకాశం ఉందని చెప్పారు.


