
అన్నమయ్య జిల్లా : తంబళ్లపల్లెలో వింత పాము ప్రత్యక్షమైంది. మల్లయ్యకొండ కింద పొలం పనులకు వెళ్లిన రైతులకు ఈ పాము కనిపించింది. బ్రాహ్మణ బ్లైండ్ స్నేక్ (ప్లవర్ పాట్ స్నేక్) గా పిలవబడే ఈ పాము ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పాము 1–018 సెంటీమీటర్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. భూమి లోపల ఉండే పాము వర్షం పడిన సమయాల్లో అరుదుగా బయటకు వస్తుందన్నారు.