పడక గదిలో కింగ్‌ కోబ్రా | - | Sakshi
Sakshi News home page

పడక గదిలో కింగ్‌ కోబ్రా

Aug 18 2024 12:20 AM | Updated on Aug 18 2024 12:25 PM

-

శివమొగ్గ: ఇంటిలో ఒక చిన్న ఎలుక సంచరిస్తేనే మనకు రాత్రంతా భయంగా ఉంటుంది. అలాంటిది పడకగదిలోనే మహాసర్పం ఒకటి తిష్ట వేస్తే ఇక ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తీర్థహళ్లి తాలూకా ఆగుంబె సమీపంలోని సిగువ సోమేశ్వర గ్రామంలో ఎదురైంది. 

అక్కడి ఇంటి పడకగదిలోకి సుమారు 9 అడుగుల పొడవైన కింగ్‌ కోబ్రా ఒకటి చేరింది. ఒక పాత్రలో చేరి దర్జాగా పడకేసింది. ఇంటివారు చూసి వణికిపోయారు. అటవీసిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలుచుకొచ్చి సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement