హుషారుగా కంబళ పరుగు | - | Sakshi
Sakshi News home page

హుషారుగా కంబళ పరుగు

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

మైసూరు: నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో తొలిసారిగా మంగళూరు సంప్రదాయ జానపద క్రీడ కంబళ పోటీలను నిర్వహించారు. సాతగళ్లి వీటీయూ కాలేజీ దగ్గర విశాలమైన ఆవరణలో కంబళ మడులను ఏర్పాటు చేశారు. మంత్రి యతీంద్ర ప్రారంభించారు. కంబళ కరావళికే పరిమితం కాకూడదని, అందుకే దసరా మహోత్సవంలో ప్రాచుర్యం పొందాలని తీసుకువచ్చినట్లు తెలిపారు. పుత్తూరు ఎమ్మెల్యే అశోక్‌ రై, ఎమ్మెల్యేలు జీటీ దేవెగౌడ, ఎమ్మెల్సీ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. దున్నపోతులు బురదమడిలో పరుగులు తీస్తే వందలాది మంది కేరింతలు కొడుతూ వీక్షించారు. మళ్లీ సాయంత్రం నుంచి విద్యుద్దీపాల వెలుగులో హుషారుగా జరిగాయి. ఓ దున్న అదుపుతప్పి జనం మీదకు వెళ్లడంతో కకావికలమయ్యారు. ఎవరికీ ఏమీ కాలేదు.

బురద మడిలో దున్నల పరుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement