బజార్లు కళకళ | - | Sakshi
Sakshi News home page

బజార్లు కళకళ

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

● పండుగ సామగ్రి విక్రయాల జోరు

బనశంకరి: ఆయుధ పూజ, దసరా వస్తుండగా బెంగళూరులో బజార్లు పూజా సామగ్రి కొనుగోళ్లతో కిక్కిరిసిపోయాయి. యథా ప్రకారం పూలు, పండ్ల ధరలు భారీగా పెరిగాయి. కేఆర్‌ మార్కెట్‌, యశవంతపుర, మల్లేశ్వరం, విజయనగర, జయనగర, గాంధీబజార్‌తో పాటు నగరంలోని ప్రముఖ మార్కెట్లలో పూలు, పండ్లు, అరటిపిలకలు, బూడిద గుమ్మడికాయలు, స్వీట్ల వ్యాపారం జోరుగా జరిగింది. గతవారం సేవంతి పుష్పాలు కిలో రూ.150 ఉండగా, ఇప్పుడు రూ.250 నుంచి 300 కు పెరిగాయి. కనకాంబరాలు, చెండు, సుగంధరాజ పూలకు డిమాండ్‌ ఏర్పడింది. గుమ్మడి కిలో రూ.25 నుంచి 30 తో విక్రయిస్తున్నారు. మల్లిగే రూ.400, తులసి హారాలు రూ.200 ధరతో విక్రయిస్తున్నారు. కేఆర్‌ మార్కెట్లో పూల రాశులు కనువిందు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement