సర్కారుకు స్టింగ్‌ కంగారు | - | Sakshi
Sakshi News home page

సర్కారుకు స్టింగ్‌ కంగారు

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో వారంరోజులుగా తీవ్ర కలకలానికి కారణమైన స్టింగ్‌ ఆపరేషన్‌ ఆరోపణలపై డీకే సర్కారు దృష్టి సారించింది. నాపై, మంత్రులపై రహస్య ఆపరేషన్‌ జరుగుతోందని సీఎం డీకే ప్రకటించడం తెలిసిందే. అసలైన ఆపరేషన్‌ సిద్దరామయ్య మీద జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించడం, సీఎంపై విమర్శలు చేయడంతో ఇదో చిక్కుముడిగా తయారైంది.

ఈ తరుణంలో శుక్రవారం రాత్రి మైసూరులో ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్దరామయ్యను కలుసుకుని చర్చించినట్లు సమాచారం. డీకే, సిద్దు గంటసేపు రహస్యంగా మాట్లాడుకున్నారు. స్టింగ్‌ ఆపరేషన్‌, ఫిర్యాదు, వీడియోపై చర్చలు జరిగాయని చెబుతున్నారు. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు, అంతర్గత సమస్యలపై తీవ్రంగా చర్చలు జరిగాయి. స్టింగ్‌ రచ్చ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు నాయకుల రహస్య సమావేశం ఎంతో ఉత్సుకతను రేకెత్తించింది.

వీడియోపై పోలీసుల విచారణ

సిద్దరామయ్యపై చేశారని ప్రచారంలోఉన్న స్టింగ్‌ వీడియో మీద బెంగళూరు పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే పెద్దగా పురోగతి లేదని తెలుస్తోంది. యూట్యూబ్‌తో సహా వివిధ వెబ్‌సైట్‌లలో ఉన్న ఆడియోలను సేకరించి విశ్లేషించే పనిలో ఉన్నారు. పోలీసులు ఇప్పటికే చాలామందిని ప్రశ్నించారని చెబుతున్నారు. ఆడియో, వీడియో వైరల్‌ కావడం వెనుక ఉన్నవారిని కనుగొనేందుకు పోలీసుల యూట్యూబ్‌తో సహా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారంలలో గాలిస్తున్నారు.

వీడియోలో ఏముంది?

ముఖం కనిపించకుండా, గొంతు మాత్రమే వినిపిస్తున్న ఒక యువతి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇది ఒక స్టింగ్‌ ఆపరేషన్‌ అని అంటున్నారు. ఇది నిజమైనదా, లేక టెక్నాలజీతో రూపొందిందా? అనే దానిపైనా దర్యాప్తు జరుగుతోంది. ఆపరేషన్‌ వెనుక పెద్ద కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. గత సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నాలుగు రోజుల్లో 21 మందికి పైగా అనమానితులపై కన్నేసినట్లు పోలీసులు తెలిపారు.

సిద్దరామయ్యతో సీఎం డీకే శివ భేటీ

గంటకుపైగా రహస్య మంతనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement