Sakshi News home page

Tears of Camels: పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!

Published Wed, Feb 21 2024 11:03 AM

Tears of Camels Anti Vanom Drug for Snake Poison - Sakshi

ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల  ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్‌ఎల్‌) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్‌ఎల్‌ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. 

ఒంటె కన్నీటిలో అనేక రకాల  ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా,  తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.

Advertisement

What’s your opinion

Advertisement