Hyderabad: ట్రాఫిక్‌ సిగ్నల్‌పై పాము | - | Sakshi
Sakshi News home page

Hyderabad: ట్రాఫిక్‌ సిగ్నల్‌పై పాము

Jun 8 2024 8:52 AM | Updated on Jun 8 2024 9:11 AM

-

లిబర్టీ వద్ద కలకలం

 గంటపాటు ట్రాఫిక్‌ జామ్‌

హిమాయత్‌నగర్‌: లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం లిబర్టీ చౌరస్తా సిగ్నల్‌ వద్ద ఉన్న వేప చెట్టుపై మొదట పాము ప్రత్యక్షమైంది. అక్కడి నుండి కేబుల్‌ వైర్ల సహాయంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌పైకి చేరింది. నిత్యం ట్రాఫిక్‌ తో రద్దీగా ఉండే సిగ్నల్‌ వద్ద ఒక్కసారిగా పాము కనిపించడంతో వాహనదారులు ఖంగుతిన్నారు. 

ఆ పాము ఎక్కడ మీద పడుతుందో అని ఎక్కడికక్కడ తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొద్దిసేపటికి సిగ్నల్‌ పోల్‌ సహాయంతో కిందకు చేరిన పాము..పక్కనే ఖాళీగా ఉన్న బిల్డింగ్‌ సెల్లార్‌ లోకి వెళ్లింది. దీంతో వాహనదారులు, పోలీస్‌ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా కొందరు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement