
కొలంబో వేదికగా తొలి వన్డేలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా సుమారు 6 అడుగుల పొడవున్న పాము మైదానంలో ప్రత్యక్షమైంది. బిగ్ స్క్రీన్‌లో పామ్‌ను చూసిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు.
ఆటగాళ్లు సైతం కాస్త గందరగోళానికి గురయ్యారు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్‌లకు పాము హాజరై కలకలం రేపింది. అదేవిధంగా బంగ్లా-శ్రీలంక టెస్టు సిరీస్ సందర్భంగా పాములు పట్టుకుని స్నేక్ క్యాచర్ కూడా కెమెరాకు చిక్కాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్‌ను 77 పరుగుల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక(106) సెంచరీతో మెరిశాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయసంగా గెలిపించేలా కన్పించిన బంగ్లాదేశ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లంక బౌలర్లలో హసరంగ 4, కమిందు మెండిస్ 3 వికెట్లు పడగొట్టారు. అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్
Bangladesh’s batting: now you see it, now you don’t 🎩
The visitors went off a cliff in Colombo losing 7 wickets for just 5 runs in a stunning meltdown 😳#SLvBAN pic.twitter.com/8ea1xiXjOz— FanCode (@FanCode) July 2, 2025
#snake #Cricket pic.twitter.com/Y5KMfE94aZ
— ABHISHEK PANDEY (@anupandey29) July 3, 2025