పాము ఈ పేరు వింటే చాలు చాలామందికి గుండె గుబేల్ మంటుంది. అవి ఇంట్లోకి వచ్చినా.. వాటిని చుసినా భయంతో పరుగెత్తుతారు. ఇక పామే మనపై పడుకుంటే.. అప్పుడు పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకొండి.. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలోని ఓ మహిళకు జరిగింది. దీంతో ఆమె గుండె ఆగినంత పనైందని ఆ సమయంలోనే తన అనుభవాల్ని మీడియాతో పంచుకుంది.
బ్రిస్సెన్స్‌కు చెందిన ఓ దంపతులు యథావిధిగా రాత్రి పడుకున్నారు. ఉదయం అవడంతో భర్త నిద్రలేచి లైటు వేశారు. దీంతో నిద్రలేచిన మహిళ కళ్లు తెరిచేసరికి గుండె ఆగినంత పనైంది. తన ఛాతిపై 2.5 మీటర్ల పొడుగైన పాము పడుకొని ఉంది. దీంతో అప్పుడు తనకు కలిగిన భావనను ఆ మహిళ మాటల్లో "నాకళ్లు తెరిచేసరికి నాపైన పెద్ద పాము పడుకొని ఉంది. భయంతో నాకు ఏం చేయాలో తోచలేదు. వెనక నుంచి నాభర్త కదవలవద్దు అన్నారు. దీంతో భయంభయంగా అలానే ఉన్నాను" అని చెప్పారు.
దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్లిన ఆమె భర్త పాములను పట్టే వ్యక్తిని తీసుకవచ్చారు. అతను ఆ మహిళకు ఏం ప్రమాదం కాకుండా ఆ సర్ఫాన్ని తీసి సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనను తలుచుకుంటే తనకు ఎంతో భయంగా ఉంటుందని ఆ మహిళ తెలిపింది. అయితే ఆ పాము విషపూరితమైనది కాదని వన్యప్రాణి అధికారులు తెలిపారు.
కాగా చలికాలం కావడంతో వెచ్చదనం కోసం పాములు ఇండ్లలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. ఇంటికి ఎటువంటి రంద్రాలు లేకుండా ఉంచడంతో పాటు తలుపులు వేసి ఉంచడం ద్వారా పాములు రావడాన్ని కొంతమేర నియంత్రించవచ్చని పేర్కొన్నారు. సరైన శిక్షణ లేకుండా పాములను పట్టుకోవడం చేయవద్దని అలా చేయడం ద్వారా అవి కరిచే ప్రమాదముందని అధికారులు తెలిపారు.


