
ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman gill) అద్బుతమైన సెంచరీ సాధించాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుబ్‌మన్ గిల్.. బాధ్యయుత ఇన్నింగ్స్‌తో కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. తొలుత ఆచితూచి ఆడిన గిల్.. మొదటి 100 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు.
ఆ తర్వాత క్రీజులో నిలదొక్కున్నాక తనదైన శైలిలో గిల్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ 199 బంతుల్లో తన ఏడవ టెస్ట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో కూడా గిల్ సూపర్ సెంచరీతో మెరిశాడు.
ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఆటను చూసి దక్షిణాఫ్రికా లెజెండ్ గ్రేమ్ స్మిత్ గర్వపడతుంటాడని యువరాజ్ కొనియాడాడు. కాగా గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో తన తొలి టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు గిల్ డబుల్ సెంచరీలు సాధించికపోయినప్పటికి.. వరుసగా రెండు సెంచరీలు మాత్రం నమోదు చేశాడు. ఈ క్రమంలోనే గిల్‌ను స్మిత్‌తో యువీ పోల్చాడు.
"జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది నేను ఉన్నా అంటూ ముందుకు వస్తారు. ఆ కోవకు చెందినవాడే శుబ్‌మన్ గిల్. టెస్టు కెప్టెన్‌గా వరుసగా సెంచరీలు చేసిన అతికొద్ది మందిలో ఒకడిగా గిల్ నిలిచాడు. ఎంతో ప్రశాంతత, ధైర్యవంతంగా బ్యాటింగ్ చేయడం, జట్టును విజయవంతంగా నడిపించాలనే తపన గిల్‌లో కన్పించాయి.
అతడిని చూసి గ్రేమ్ స్మిత్ కచ్చితంగా గర్వపడుతుంటాడు అని ఎక్స్‌లో యువీ రాసుకొచ్చాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు.
చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా