
భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఇంగ్లండ్ గడ్డపై అదరగొడుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో గిల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన టీమిండియాను జైశ్వాల్‌తో కలిసి గిల్ ఆదుకున్నాడు.
ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నాక తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను భారీ స్కోర్ దిశగా శుబ్‌మన్ నడిపిస్తున్నాడు. గిల్ 216 బంతుల్లో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. గిల్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.
కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా(41) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
గిల్ సాధించిన రికార్డులు ఇవే..
👉కెప్టెన్‌గా వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా గిల్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు విజయ్ హాజారే, సునీల్ గవాస్కర్ టెస్టు కెప్టెన్లుగా మొదటి రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లి వరుసగా మూడు మ్యాచ్‌లలో శతక్కొట్టాడు.
👉ఇంగ్లండ్ గడ్డపై రెండు టెస్టు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన ఆసియా కెప్టెన్‌గా శుబ్‌మన్ నిలిచాడు. గిల్ కేవలం 25 సంవత్సరాల 297 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇంగ్లండ్‌లో అతి తక్కువ వయస్సులో రెండు టెస్టు సెంచరీలు పర్యాటక బ్యాటర్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఈ ఘనతను 22 సంవత్సరాల 180 రోజుల వయస్సులో సాధించాడు. స్మిత్ తర్వాత ఈ ఫీట్ సాధించింది శుబ్‌మనే కావడం గమనార్హం.
👉అదేవిధంగా ఇంగ్లండ్‌లో రెండుసార్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ భారత ఆటగాడిగా ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఓవరాల్‌గా 13వ ప్లేయర్‌గా గిల్ రికార్డులకెక్కాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్