లంక ప్రీమియర్‌ లీగ్‌లో మరోసారి పాము కలకలం.. తృటిలో తప్పించుకున్న ఉదాన

Isuru Udana Luckily Escapes From Snake In LPL 2023, Video Goes Viral - Sakshi

లంక ప్రీమియర్‌ లీగ్‌-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్‌ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్‌ 12) ​కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్‌, బి లవ్‌ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్‌చల్‌ చేసింది.

మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్‌ ప్రదీప్‌ బౌలింగ్‌ చేసే ముందు ఫీల్డింగ్‌ సెట్‌ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్‌ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్‌ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఇదిలా ఉంటే, బి లవ్‌ క్యాండీ-జాఫ్నా కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ హరీస్‌ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్‌ జామన్‌ (22), ఏంజెలో మాథ్యూస్‌ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు.

జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్‌ మాలిక్‌ (55), తిసార పెరీరా (36), క్రిస్‌ లిన్‌ (27), డేవిడ్‌ మిల్లర్‌ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్‌ 3, నువాన్‌ ప్రదీప్‌ 2, ఇసురు ఉదాన ఓ వికెట్‌ పడగొట్టారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top