పూజగదిలో బుస్‌.... | - | Sakshi
Sakshi News home page

పూజగదిలో బుస్‌....

Oct 2 2023 1:46 AM | Updated on Oct 2 2023 7:12 AM

- - Sakshi

దేవుని గదిలో పాము బొమ్మను పెట్టుకుని నాగదేవత అని పూజలు చేస్తారు. అదే నిజమైన పాము వస్తే బెంబేలెత్తిపోతారు.

కర్ణాటక: దేవుని గదిలో పాము బొమ్మను పెట్టుకుని నాగదేవత అని పూజలు చేస్తారు. అదే నిజమైన పాము వస్తే బెంబేలెత్తిపోతారు. ఆహారం వెతుక్కుంటూ వచ్చిన నాగుపాము ఒకటి ఇంటిలోకి వెళ్లి ఏకంగా దేవుని గదిలో తిష్టవేసింది. పడగ విప్పి బుస్‌ మంటున్న పామును చూసి ఇంట్లోనివారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ సంఘటన తుమకూరు నగరంలోని యల్ళాపురలోని వినాయక నగరలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

సిద్దరాజు అనే వ్యక్తి ఇంటిలోని దేవుని గదిలోకి ఎక్కడి నుంచో నాగుపాము వచ్చింది. పూజ చేయాలని వచ్చిన సిద్దరాజు పామును చూసి భయపడిపోయాడు. పాములు పట్టడంలో నిపుణుడైన దిలీప్‌కు కాల్‌ చేయగా ఆయన వచ్చి పామును పట్టుకుని దేవరాయన దుర్గ అడవిలో వదిలిపెట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement