దొడ్డబళ్లాపురం: చిక్కబళ్లాపురం: బొలెరో వాహనాన్ని కారు అదుపుతప్పి ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిక్కబళ్లాపురం వద్ద బెంగళూరు– హైదరాబాద్ 44వ హైవేలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. బెంగళూరు నుంచి చిక్కబళ్లాపురం వద్దనున్న ఈశా సెంటర్‌కు వెళ్లాలని వస్తున్న కారు, అతి వేగంతో అదుపుతప్పి డివైడర్ దాటుకుని ఎదురుగా వస్తున్న వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న 5 మందిలో నలుగురు తీవ్రగాయాలతో అక్కడే మరణించారు.
అందరూ యలహంకవాసులే!
వైష్ణవ్, శ్రేయస్, సిద్ధార్థ, యశ్వంత్ మృత్యువాత పడ్డారు. అందరూ 25 ఏళ్లలోపువారే. బెంగళూరు యలహంక వాసులుగా గుర్తించారు. ఓ క్షతగాత్రుని పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. కారు బొలెరోను ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో విసిరేసినట్లు బయటకు పడిపోయారు. బొలెరో డ్రైవరుకు కాలు కట్ అయ్యింది. రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. నందిగిరి ధామ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
హైవేలో బొలెరోను కారు ఢీ
నలుగురు యువకుల మృతి
చిక్కబళ్లాపురం వద్ద ఘోరం


