పట్టు స్టాల్‌లో సందర్శకులు
సన్‌ఫ్లవర్ చెంత సంతోషం
సాక్షి బెంగళూరు: బెంగళూరు వ్యవసాయ వర్సిటీ జీకేవీకేలో సోమవారం ప్రారంభమైన కృషి మేళా బుధవారంతో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మేళాలో రైతులు, వ్యవసాయ వ్యాపారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన వంగడాలను, యంత్ర పరికరాలను ఇందులో ప్రదర్శించారు. సుమారు 100 సాంకేతిక స్టాళ్లకు అవకాశం కల్పించారు. పది ఎకరాల్లో సుమారు 75 వైవిధ్యమైన పంటల రకాలను ప్రదర్శించారు. తక్కువ నీరు, ఎరువులతో ఎక్కువ దిగుబడి వచ్చే విధానాలకు పెద్దపీట వేశారు. ఎల్‌నినో సమస్య, కరువును తట్టుకోవడం, జల సంరక్షణ గురించి రైతులకు నిపుణులు సూచనలు చేశారు. అలాగే వ్యవసాయంలో విశేష సేవలందించిన రైతులు, నిపుణులను సన్మానించారు. బుధవారం కూడా భారీసంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.
ఘనంగా ముగింపు


