ఘనంగా ధన్వంతరి జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ధన్వంతరి జయంతి

Nov 19 2026 3:01 AM | Updated on Nov 19 2026 3:01 AM

బొమ్మనహళ్లి: ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపురలోని నూతననగరలో ఆరోగ్యభారతి, చౌడేశ్వరి క్లబ్‌ ఆధ్వర్యంలో ధన్వంతరి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి స్వామిని ఆరోగ్య శాస్త్రాల అధిపతిగా, నారాయణుని నిజమైన అవతారంగా, మానవాళికి దీర్ఘాయువును, వైద్య శాస్త్రాన్ని ప్రసాదించిన దైవిక శక్తిగా వక్తలు అభివర్ణించారు. మహిళలు భగవద్గీత, ధన్వంతరీ గీతాలను ఆలపించారు.

మహిళకు గాయాలు..

ల్యాప్‌టాప్‌ మాయం

యశవంతపుర: సిలికాన్‌ సిటీలో సానుభూతి, మానవత్వం అనేవి కరువవుతున్నాయా?, గాయపడిన మహిళ సొత్తును కూడా కొందరు వదలడం లేదు. ప్రమాదంలో కింద పడిన మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి ఆమె లాప్‌టాప్‌ బ్యాగ్‌తో ఓ దుండగుడు పరారయ్యాడు. హెణ్ణూరు రింగ్‌రోడ్డు అండర్‌పాస్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రైవేటు కంపెనీలో పనిచేసే మహిళ స్కూటర్‌లో ఆఫీసుకు వెళ్తుండగా రోడ్డుపై ఉన్న బురద వల్ల జారి కిందపడింది. గాయాలైన ఆమెకు స్థానికులు కూర్చోబెట్టి సపర్యలు చేశారు. వారిలో ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నమ్మించి రూ.94 వేల విలువగల ల్యాప్‌టాప్‌ బ్యాగును తీసుకుని జారుకున్నాడు. కొంతసేపటికి ఆమె ల్యాప్‌టాప్‌ కోసం చూడగా కనబడలేదు. చికిత్స నుంచి కోలుకున్న తరువాత బాణసవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సిటీలో ప్రమాదాలు.. ముగ్గురు మృతి

యశవంతపుర: బెంగళూరు నగరంలో మూడు ప్రమాదాలలో ముగ్గురు బలయ్యారు. వైట్‌ఫీల్డ్‌ ఠాణా పరిధిలో సిద్ధాపుర రోడ్డులోని సెల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద బైకు, గూడ్స్‌ వాహనం ఢీకొన్న ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పంచానంద్‌ దాస్‌ (21) మృతి చెందారు. సెక్యూరిటి గార్డ్‌గా పని చేస్తున్న దాస్‌ రాత్రి బైక్‌పై వెళ్తుండగా వ్యాన్‌ ఢీకొనింది.

● కేఆర్‌పుర పరిధిలో కాయగూరలను తరలించే ఆర్‌ఎంసీ లారీ, బైకును ఢీకొంది. బైక్‌పై వెళ్తున్న ప్రైవేటు ఉద్యోగి ప్రభులింగయ్య (25) మృతి చెందారు.

● హెణ్ణూరు రోడ్డులో అయిల్‌ మీల్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం వేగంగా వెళుతున్న బైకు అదుపుతప్పి పడింది. కాచకారనహళ్లికి చెందిన బైకిస్టు డెస్పార్‌ (46) గాయాలతో చనిపోయాడు. కేజీ హళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

మైసూరులో దొంగల జోరు

● ఇళ్లలోకి దూరి, కారం చల్లి

2 గొలుసు చోరీలు

మైసూరు: ప్యాలెస్‌ సిటీలో దోపిడీ దొంగల దాడులు మహిళలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇళ్లలో కూర్చున్నా కూడా వదలడం లేదు. పట్టపగలే రెండిళ్లలోకి చొరబడిన దుండగులు మహిళల కళ్లల్లోకి కారం పొడి చల్లి మంగళసూత్రాలను లాక్కొని పరారయ్యారు. మైసూరులోని కుంబారగేరిలో ఇవి జరిగాయి. అక్కడి నివాసులు రాధ (42), ప్రకృతి (30) అనే మహిళలు బాధితులు.

● ఇంటి తలుపు గొళ్లెం పెట్టకుండా మూసివేసి ఇంట్లో ఉండగా ముఖానికి నలుపు రంగు బట్ట కట్టుకున్న ఓ వ్యక్తి చొరబడి నా కళ్లలో కారం చల్లి సుమారు రూ.4 లక్షల విలువ వేసే 35 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడని ప్రకృతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

● ఇంటి రెండో అంతస్తులో ఉన్న రాధ బిగ్గరగా అరుస్తూ ఏడ్చారు. స్థానికులు వెళ్లి చూడగా ఆమె కళ్లలో కారంతో విలవిలలాడుతోంది. ఎవరో దొంగ తన 5 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొన్న పారిపోయినట్లు ఆమె తెలిపింది. ఒకే దొంగ ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. లష్కర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement