టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం | Cobra Causes Chaos in TTD EO Shyamala Rao bungalow | Sakshi
Sakshi News home page

టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం

Apr 18 2025 12:59 PM | Updated on Apr 18 2025 3:08 PM

Cobra Causes Chaos in TTD EO Shyamala Rao bungalow

తిరుపతి,సాక్షి: తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం రేపింది. గురువారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చారు.  

ఈవో శ్యామలరావు సమాచారంతో పామును పట్టుకునేందుకు రిటైర్డ్‌ టీటీడీ ఉద్యోగి రవీందర్‌ నాయుడు బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లాలో బుసలు కొడుతున్న పామును చాకిచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును  గోనె సంచిలో వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.

దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం  రవీందర్‌ నాయుడును స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స కొనసాగుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement