హీరో సందీప్ కిషన్, హీరోయిన్ మిథిలా పాల్కర్, నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘సూపర్ సుబ్బు’. మల్లిక్ రామ్, రమేష్ ఎలిగేటి, శివాని ధోబాల్ రచించిన ఈ సిరీస్‌కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్‌లో గెటప్ శ్రీను, మానస చౌదరి, జీవన్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. చిలకా ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా, భరత్ లక్ష్మీపతి నిర్మించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.


