
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టు(Indira Gandhi Airport)లో కలకలం చెలరేగింది. కస్టమ్స్ అధికారులు అరుదైన జీవ జాతులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ ఉదంతంలో ముగ్గురు భారత పౌరులను అదుపులోనికి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే నిన్న(శనివారం) రాత్రి బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం ఏఐ 303లో ముగ్గురు ప్రయాణికులు అరుదైన జీవ జాతులను అక్రమంగా భారతదేశానికి తీసుకువచ్చారు. వీరి బ్యాగులను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు(Customs officials) షాక్ తిన్నారు. ఆ బ్యాగులో పాములు, బల్లులు, కప్పలు, కీటకాలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జీవ జాతులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ జీవ జాతులను వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ అథారిటీకి అప్పగించారు. గతంలోనూ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇటువంటి ఉదంతాలు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే!