Snake Entered The RTC Bus In Nirmal District, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Snake In Nirmal RTC Bus: బస్సు ఎక్కిన పాము.. ఎక్కడికెళ్దామని?

Aug 4 2023 4:46 PM | Updated on Aug 4 2023 6:55 PM

Nirmal District:  Snake Entered The RTC Bus Video Viral - Sakshi

నర్సాపూర్‌:  నిర్మల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో చొరబడిన పాము అందరిని హడలెత్తించింది. కుంటాల మండలం ఓలా నుంచి నిర్మల్ వైపు ప్రయాణికులతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. ఒక్కో గ్రామంలో ప్రయాణికులతో పాటు విద్యార్థులు ఎక్కుతూ వచ్చేసరికి రద్దీ పెరిగింది.

ఈ క్రమంలో కొందరు విద్యార్థులు బస్సు వెనుక సీట్లవైపు వెళ్లారు. బస్ రన్నింగ్ లో ఉండగానే సీటు కింద తిరుగుతున్న పామును విద్యార్థులు గుర్తించారు.   అప్రమత్తమైన డ్రైవర్ నర్సాపూర్ వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఆయన దానిని బంధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి పామును చంపేయడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement