హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ రెండవ అంతస్తుకు వచ్చిన నాగుపాము కార్మికులకు భయాందోళనకు గురిచేసింది. నార్సింగి సర్కిల్, నెక్నాంపూర్ గోల్కొండ హిల్స్‌లో నిర్మాణం జరుగుతున్న అపార్ట్‌మెంట్‌లోకి శనివారం ఐదు అడుగుల నాగుపాము వచి్చంది. దీంతో కారి్మకులు చూసి భయాందోళన చెందారు. స్నేక్ సొసైటీ సభ్యులు వచ్చి బంధించి తీసుకువెళ్లారు. ఎక్కడ పాములు కనిపించినా తమకు ఫోన్ నెంబర్ 83742 33366 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


