‘కారు సైడ్ మిర్రర్‌లో పాము!.. బుసలు కొడుతూ బయటకొచ్చింది’ | Snake Slithers Out Of Car Side Mirror In Tamil Nadu | Sakshi
Sakshi News home page

కారు సైడ్ మిర్రర్‌లో పాము!.. బుసలు కొడుతూ బయటకొచ్చింది.. వీడియో వైరల్

Nov 11 2025 8:26 PM | Updated on Nov 11 2025 8:54 PM

Snake Slithers Out Of Car Side Mirror In Tamil Nadu

సాక్షిచెన్నై: ఓ ఫ్లైఓవర్‌పై కారు వేగంగా దూసుకెళ్తోంది. అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే... ఆ కారు సైడ్ మిర్రర్ వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వస్తోంది! ఆ పామును చూసిన డ్రైవర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి, తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కారు యజమానులు మన కారులో ఇలాంటి పాములు దాగి ఉన్నాయేమో అన్న భయంతో తమ వాహనాలను పరికించి పరికించి పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఇటీవల తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డులో ఓ డ్రైవర్ కారుకు ఊహించని అనుభవం ఎదురైంది. కారు నడుపుతుండగా సైడ్ మిర్రర్ నుండి ఒక పాము బయటకు వచ్చింది. రద్దీగా ఉండే  ప్రాంతంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తొలుత కారు అద్దంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించాడు. అయినా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుండగా..అగస్మాత్తుగా ఓ పాము బుసలకొడుతూ బయటకు రావడాన్ని గమనించాడు. వాహనదారులకు జాగ్రత్తలు చెప్పేందుకు వీడియో తీశాడు.

అనంతరం, కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారును ఆపాడు. ఊపిరి ఆడక కారు అద్దం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్న పాము రక్షించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కారు అద్దంలో ఇరుక్కున్న పామును పట్టుకున్నారు. స్థానిక అటవీ ప్రాంతానికి తరలించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement