breaking news
side mirror
-
‘కారు సైడ్ మిర్రర్లో పాము!.. బుసలు కొడుతూ బయటకొచ్చింది’
సాక్షిచెన్నై: ఓ ఫ్లైఓవర్‌పై కారు వేగంగా దూసుకెళ్తోంది. అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఎందుకంటే... ఆ కారు సైడ్ మిర్రర్ వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వస్తోంది! ఆ పామును చూసిన డ్రైవర్ ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి, తనకు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. కారు యజమానులు మన కారులో ఇలాంటి పాములు దాగి ఉన్నాయేమో అన్న భయంతో తమ వాహనాలను పరికించి పరికించి పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే?ఇటీవల తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డులో ఓ డ్రైవర్ కారుకు ఊహించని అనుభవం ఎదురైంది. కారు నడుపుతుండగా సైడ్ మిర్రర్ నుండి ఒక పాము బయటకు వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ తొలుత కారు అద్దంలో ఏదో కదులుతున్నట్లు గుర్తించాడు. అయినా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా..అగస్మాత్తుగా ఓ పాము బుసలకొడుతూ బయటకు రావడాన్ని గమనించాడు. వాహనదారులకు జాగ్రత్తలు చెప్పేందుకు వీడియో తీశాడు.అనంతరం, కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారును ఆపాడు. ఊపిరి ఆడక కారు అద్దం నుంచి బయట పడేందుకు మల్లగుల్లాలు పడుతున్న పాము రక్షించేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కారు అద్దంలో ఇరుక్కున్న పామును పట్టుకున్నారు. స్థానిక అటవీ ప్రాంతానికి తరలించారు. ⚠️ Safety Alert for Drivers!Shocking Incident on Namakkal–Salem Road: Snake Discovered Inside Car’s Side Mirror While DrivingAs the cold and rainy season sets in, motorists are urged to be extra cautious before hitting the road. Always inspect your vehicle thoroughly… pic.twitter.com/AOGzVdArxi— Karnataka Portfolio (@karnatakaportf) November 11, 2025 -
పిలియన్ రైడర్లకు హెల్మెట్.. మిర్రర్ మస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: పై మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు పిలియన్ రైడర్లు (మహిళలు) హెల్మెట్ ధరించకపోవడంతోనే మృతి చెందారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఎందుకంటే హెల్మెట్లు ధరించిన రైడర్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. పేట్‌బషీరాబాద్, మేడ్చల్‌లో జరిగిన రెండు ప్రమాదాల్లో హెల్మెట్లు ధరించకపోవడంతో పాటు ఆయా ద్విచక్ర వాహనాలకు సైడ్ మిర్రర్ లేకపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఒకవేళ సైడ్‌మిర్రర్ ఉండి ఉంటే ఆయా భారీ వాహనాల కదలికలను గుర్తించి ఉంటే ఈ ప్రమాదాలు జరగకపోయి ఉండొచ్చన్న మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. గతంలోనూ ఇటువంటి ఘటనలు వందల సంఖ్యలో జరుగుతుండటాన్ని గమనించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనుల వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మార్చి నెల నుంచి హెల్మెట్ లేని పిలియన్ రైడర్లకు, సైడ్ మిర్రర్ లేని వాహనాలకు ఈ– చలాన్లు విధిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనైతే ఈ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగానే కొరడా ఝుళిపించారు. కేవలం మూడు నెలల్లోనే హెల్మెట్ లేని పిలియన్ రైడర్ కేసులు 4,59,280, మిర్రర్ లేని వాహనాలకు 1,49,884 చలాన్లు విధించారు. ఇలా మొత్తం 6,09,164 ఈ– చలాన్లు జారీ చేశారు. (డబుల్స్ వస్తే రూ.500 జరిమానా) ప్రజల భద్రత కోసమే.. ‘ఎంవీ చట్టం 129 సెక్షన్ ప్రకారం నాలుగేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారూ పిలియన్ రైడర్‌గా ఉంటేæ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ లేకుండా చాలా ద్విచక్ర వాహనాలు కనిపిస్తాయి. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు. మలుపు తీసుకునేటప్పుడు, ఏదైనా వాహనాన్ని అధిగమించేటప్పుడు, రోడ్లపై సందులను మార్చేటప్పుడు వెనుక నుంచి వచ్చే ట్రాఫిక్‌ను రైడర్ గమనించడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. రహదారి భద్రత దృష్ట్యా కొన్ని నెలల నుంచి ఈ ఉల్లంఘనుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామ’ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. మార్చి నెల నుంచిఈ– చలాన్లు ఇలా.. హెల్మెట్ పిలియన్ రైడర్ కేసులు:4,59,280 మిర్రర్ కేసులు: 1,49,884 మొత్తం: 6,09,164 ఈ‘పేట్‌బషీరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో బైక్ వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు (పిలియన్ రైడర్లు) మృతి చెందారు. భారీ వాహనాలు వెనక నుంచి వచ్చి ఢీకొట్టడంతో రెండు బైక్‌లపై ఉన్న ముగ్గురు పిలియన్ రైడర్ల తలలకు తీవ్రగాయాలై మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాల్లో బైక్ రైడ్ చేస్తున్నవారు హెల్మెట్లు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.’ఈ ‘బాచుపల్లిలో భారీ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఓ బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో పిలియన్ రైడరైన మహిళ దుర్మరణం చెందారు. హెల్మెట్ ధరించిన రైడర్ ప్రాణాలతో బయటపడ్డారు’. -
బండికి మిర్రర్ లేకపోతే ఈ–చలాన్
సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నిత్యావసరాలతో పాటు వివిధ పనుల కోసం రోడ్డెక్కుతున్న వాహనదారులకు ‘సైడ్ మిర్రర్’లు వర్రీ కలిగిస్తున్నాయి. సైడ్‌మిర్రర్ లేనివాహనాలకు పోలీసులు ఈ–చలాన్ విధిస్తుండటమే ఈ ఆందోళనకు కారణం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో వాహనదారుల్లో కలవరం మొదలైంది. మోటార్ వెహికల్ యాక్ట్ 177 సెక్షన్ కింద సైడ్ మిర్రర్ లేకుంటే వాహనాలకు విధిస్తున్న ఈ–చలాన్‌పై నగరవాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైక్‌లకు సైడ్ మిర్రర్లు ఉండటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించి జాగ్రత్తగా డ్రైవ్ చేసే అవకాశం ఉంటుందని, ఈ చలాన్లు విధించడం మంచిదే అని కొంతమంది పోలీసుల తీరును సమర్థిస్తున్నారు. తొలుత పూర్తిస్థాయిలో వాహనదారులకు అవగాహన కలిగించాకా ఈ–చలాన్లు విధిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మణికొండకు చెందిన వ్యాపారి రామకృష్ణ వ్యక్తం చేశారు. ప్రతిసారి రూ.100ల జరిమానా, రూ.35ల యూజర్ చార్జీలు కలిపి రూ.135లు చెల్లించాల్సి వస్తోందన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంలో భాగంగానే సైడ్ మిర్రర్లకు ఈ–చలాన్లు విధిస్తున్నామని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. -
అద్దాలు పగులగొట్టి రూ.4 లక్షలు చోరీ
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): ఆగివున్న ఇన్నోవా వాహనం సైడ్ అద్దం పగులగొట్టి అందులోని నగదు, డాక్యుమెంట్లు, వివిధ బ్యాంకుల చెక్కులను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం పట్టపగలు ఆపహరించుకుపోయారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం సమీపంలో చోటుచోసుకుంది. స్థానిక సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం వివరాలు.. నగరంలోని హబ్సిగూడకు చెందిన అంతోని అనే బిల్డర్ మన్నేగూడ సమీంపలోని ప్రముఖ టౌన్ షిప్లో అపార్టుమెంట్ నిర్మిస్తున్నాడు. కూలీలకు డబ్బులు చెల్లించేందుకు వాహనంలో సుమారు నాలుగు లక్షల రూపాయలను తీసుకోచ్చాడు. ప్లాట్ల రిజిష్ట్రేషన్ వుండటంతో ఇబ్రహీంపట్నం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి ఇన్నోవా వాహనంలో వచ్చారు. సమీపంలో వున్న మజీద్ వద్ద వాహనాన్ని నిలిపి సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయంలోనికి వెళ్లాడు. అరగంట వ్యవధిలోనే తిరిగి వాహనం వద్దకు చేరుకోని చూసే సరికి సైడ్ అద్దం పగలివుంది. అందులోని రెండు బ్యాగులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకేళ్లారు. ఒక దాంట్లో సుమారు 4 లక్షల నగదు, వివిధ బ్యాంకుల చెక్కుబుక్కులు, మరో బ్యాగులో విలువైన డాక్యుమెంట్లు వున్నాట్లు తెలిపారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆయా రోడ్లలో వున్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు వాహనాలపై ఇన్నోవా వద్ద నిల్చుని ఉన్నట్టు అక్కడున్న స్థానికులు తెలిపారు. వందలమంది తిరిగే సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయం వద్ద పట్టపగలు చోరి జరగడంపట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని సీఐ జగదీశ్వర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.


