కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే.. | snake bite to Farmer | Sakshi
Sakshi News home page

కాటేసిన నాగుపాము, ఆ రైతు ఏం చేశాడంటే..

Published Wed, Jun 19 2024 1:48 PM | Last Updated on Wed, Jun 19 2024 2:03 PM

snake bite to Farmer

వేలూరు: కాటేసిన నాగుపాముతో ఓ రైతు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన సంఘటన కలకలం రేపింది. తిరుపత్తూరు జిల్లా వాదనవాడి గ్రామానికి చెంది న వేలాయుధం రైతు. ఇతడి వ్యవసాయ బావిలో పూడికతీత పనులు సాగుతున్నాయి. ఆ సమయంలో రైతు వేలాయుధం కాలుపై పాము కరిచినట్లు కనిపించింది. 

దీంతో అక్కడ కనిపించిన నాగు పామును కొట్టి చంపి దాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకొని వెంటనే తిరుపత్తూరు ప్రభు త్వాస్పత్రికి తెచ్చాడు. దాన్ని చూ సిన అత్యవసర విభాగంలోని వైద్యులు అవాక్కయ్యారు. కాగా వేలాయుధం తనను ఈ పాము కరిచిందని వెంటనే వైద్యం అందజేయాలని  తెలిపి స్పృహ త ప్పి పడిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది వెంటనే రైతుకు వైద్యం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement