కుమ్మెర జాతరలో నిర్వాహకులు తోసేశారని కుటుంబీకుల ఆరోపణ
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు..
నాగర్‌కర్నూల్ క్రైం: దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఆలయ నిర్వాహకులు, కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన తోపులాటలో కిందపడిన రెండు నెలల చిన్నారి మూ డురోజుల అనంతరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18న మల్లన్న జాతర జరుగుతుండగా ఇదే గ్రామానికి చెందిన చంద్రకళ తన కూతురు కీర్తి, కుమారుడు గణేష్, కోడలు మౌనికతోపాటు రెండు నెలల చిన్నారి (మనుమరాలు)తో కలిసి మల్లన్న దర్శనానికి వెళ్లింది.
అయితే జాతర నిర్వాహకులు దర్శనానికి రూ.వంద చెల్లించాలని కోరగా నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కొందరు జాతర నిర్వాహకులు గణేష్, చంద్రకళను కొబ్బరికాయల రూంలోకి తీసుకెళ్లి గణేష్‌ను చితకబాదారు. కొబ్బరికాయల రూంలో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. కొబ్బరి కాయల రూం బయట ఉన్న చంద్రకళ కోడలు మౌనిక, రెండు నెలల మనుమరాలు, కూతురు కీర్తి గణేష్‌ను కొట్టవద్దని అడ్డు వెళ్లగా జాతర నిర్వాహకులు తోసివేయ డంతో రెండు నెలల చిన్నారితో సహా అందరూ కిందపడిపో యారు.
ఈ క్రమంలోనే చిన్నారికి అంతర్గతంగా గాయాలయ్యాయని బాధితులు ఆరో పించారు. అయితే శనివారం ఉదయం ఇంట్లోనే చిన్నారి అనుమానా స్పద స్థితిలో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఆలయ నిర్వాహకులు దాడి చేయ డంతోనే చిన్నారి మృతి చెందిందని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ గోవర్ధన్ అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జిల్లా ఆస్పత్రి ఎదుట ధర్నా
బాధిత కుటుంబసభ్యులను డీఎస్పీ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ పరామర్శించి బాధితులకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.


