కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు | Dowry dispute: Woman locked in room by in-laws and unleash poisonous snake on her | Sakshi
Sakshi News home page

కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు

Sep 22 2025 2:40 PM | Updated on Sep 22 2025 2:56 PM

Dowry dispute: Woman locked in room by in-laws and unleash poisonous snake on her

కట్నం డబ్బుల(dowry) కోసం  కొత్త కోడల్ని తీవ్రంగా వేధించి ,హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.  కొత్త కోడలు అని కూడా చూడకుండా  ఆమెను గదిలో బంధించి వేధించారు. అంతేకాదు విషపూరితమైన పామును (poisonous snake) వదిలారు అత్తామామలు. ప్రస్తుతం ఆమె కొన ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) కాన్పూర్‌నగరంలోని కల్నల్‌గంజ్‌లో సెప్టెంబర్ 18న  ఈ దారుణం జరిగింది.

బాధితురాలి సోదరి రిజ్వానా  ఫిర్యాదుతో ఆ అమానుషం వెలుగులోకి వచ్చింది. మార్చి 19, 2021న షానవాజ్‌తో రేష్మ వివాహం జరిగింది. మూడు ముళ్ల బంధం ఆమెకు పెనుశాపంగా మారింది. పెళ్లైన  జరిగిన కొన్ని రోజులకే అత్తింట్లో  కష్టాలుమొదలైనాయి. వరకట్నం చెల్లించ లేదంటూ రేష్మను వేధించడం  మొదలు పెట్టారు. తీవ్రంగా హింసించారు కూడా. ఆ  రేష్మ  పుట్టింటివారు రూ. 1.5 లక్షలు  ఇచ్చారు.  కానీ అదనంగా రూ. 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడితో ఆగలేదు.ఆమెను ఎలాగైన వదిలిచుకోవాలనే పన్నాగంతో  ఆమెను గదిలో బంధించారు. విషపూరితమైన సర్పాన్ని ఆమె గదిలో వదిలారు.  అర్థరాత్రి, పాము రేష్మను కాటేసింది. నొప్పితో కేకలు వేసినా అత్తింటివారు పట్టించుకోలేదు సరికదా, వికటాట్ట హాసాలు చేశారు. చివరికి ఎలాగోలా విషయం తెలుసుకున్న ఆమె సోదరి జోక్యం చేసుకొని పోలీసులకు  సమాచారం అందించింది.  కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. రిజ్వానా ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు షానవాజ్, అతని తల్లిదండ్రులు, అన్నయ్య, సోదరి, మరో ముగ్గురిపై హత్యాయత్నం, వరకట్నం తదితర కేసులు నమోదు చేశారు. 

చదవండి: నో జిమ్‌.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement