వామ్మో పాము.. విమానంలో కలకలం | Snake On Plane: Australia Flight Delayed For Two Hours | Sakshi
Sakshi News home page

వామ్మో పాము.. విమానంలో కలకలం

Jul 2 2025 3:47 PM | Updated on Jul 2 2025 4:39 PM

Snake On Plane: Australia Flight Delayed For Two Hours

ఆస్ట్రేలియాలోని విమానంలో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్‌ అయింది. మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టు నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే విమానంలోకి పాము దూరింది.

విమానంలో ప్రయాణికుల లగేజ్‌ భద్రపరిచే ప్రాంతంలోకి పాము వెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్నేక్‌ క్యాచర్‌ను రంగంలోకి దించారు. సుమారు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం విమానానికి తనిఖీలు నిర్వహించి టేకాఫ్‌ చేశారు.

మొదట పాము విషపూరితమైనదిగా అనుమానించారు.. కానీ పట్టుకున్న తర్వాత అది విషపూరితం కాదని.. అది పసిరిక పాముగా గుర్తించినట్లు స్నేక్‌ క్యాచర్‌ తెలిపారు. అధికారుల నుంచి సమాచారం అందగానే అరగంటలో తాను ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని, సెక్యూరిటీ తనిఖీల వద్ద బాగా ఆలస్యం జరిగినట్లు స్నేక్‌ క్యాచర్‌ పెల్లీ వెల్లడించాడు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement