ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందు​కు పంపిస్తున్నారంటే..

old anaconda snake was sent on leave - Sakshi

బొమ్మ అనకొండకు సెలవు

జర్మనీ మ్యూజియం నుంచి మరో చోటికి 

నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు

అనకొండ.. ఈ పేరు వినగానే మన మదిలో మనుషులను మింగివేసే అత్యంత భారీకాయం కలిగిన పాము కనిపిస్తుంది. దీనిని మనం తొలిసారి హాలీవుడ్‌ సినిమా ‘అనకొండ’లో చూసివుంటాం. అయితే మనం ఆ సినిమాలో చూసినది యానిమేషన్‌ అనకొండ. అయితే ఇప్పుడు మనం అలాంటి నిజమైన అనకొండ గురించి తెలుసుకోబోతున్నాం. వందేళ్ల వయసుగల ఆ అనకొండకు ఇప్పుడు సెలవులిచ్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు.  ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ అనకొండ ఎక్కడుందంటే..
ఈ అతిపెద్ద అనకొండ జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్‌కెన్‌బర్గ్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియంలో ఒక అనకొండ కాపిబారా(జంతువు)ను మింగేస్తూ కనిపిస్తుంది. దానిని చూడగానే అది నిజమేనని అనిపిస్తుంది. మ్యూజియంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈ అనకొండకు కొంతకాలం సెలవులిచ్చారు. దానిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు.

ఈ మ్యూజియంలో ఇంకా ఏమి ఉన్నాయంటే..
ఈ మ్యూజియంలో ఈ అనకొండ మాత్రమే కాదు, వివిధ రకాల జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో రకరకాల డైనోసార్లు కూడా ఉన్నాయి.

అనకొండలో రకాలివే..
అనకొండ ప్రధానంగా నాలుగు రకాలు. ఇందులో గ్రీన్ అనకొండ, బొలీవియన్ అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ ఎల్లో అనకొండ ప్రముఖమైనవి. వీటిలో గ్రీన్‌ అనకొండలు అతిపెద్దవి. పరిమాణంలో ఎంతో బరువైనవి. గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, వెనిజులా, సురినామ్, గయానా దేశాలలో కనిపిస్తాయి. మగ, ఆడ అనకొండల పొడవు విషయానికి వస్తే ఆడ అనకొండ.. మగ అనకొండ కంటే పొడవుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు..
 

Read also in:
Back to Top