
పాముల్లో రాజు..కాటేసిందో అంతే మటాష్ అంత భయంకరమైన పాయిజినస్ పాము కింగ్ కోబ్రా. దాన్ని చూస్తేనే భయం. అవి చాలా భయంకరమైన కారడవుల్లో ఉంటాయని విన్నాం, పలు వీడియోల్లో చూశాం. కానీ రియల్‌గా దాని సైజు ఎంత ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..వామ్మో అని ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ అందుకు సంబంధించిన 11 సెకన్ల క్లిప్‌ని నెట్టింట షేర్ చేశారు. అందులో ఒక వ్యక్తి చాలా నిర్భయంగా భారీ కింగ్ కోబ్రాని ఉత్తిచేతులతో పట్టుకుని నిలబడినట్లు కనిపిస్తుంది. ఆ భారీ కింగ్ కోబ్రాని పట్టుకున్నానన్న భయం, బెరుకు లేకుండా చాలా ప్రశాంతంగా పట్టుకుని నిల్చున్న తీరు చూస్తే..వామ్మో ఏం గుండె రా నీది అని అనిపించక మానదు.
ఈ వీడియోకి పర్వీన్ ఈ పాములు భారతదేశంలో ఎక్కడుంటాయో తెలుసా అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!.
(చదవండి: చీర ధరించడం బాగానే ఉంది..! కానీ ఇలానా..?: వీడియో వైరల్)