నచ్చిన వాటిని దక్కించుకోడానికి 'క్యూ' కట్టడం మన దేశంలో సర్వ సాధారణం. అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు టికెట్ల కోసం ధియేటర్ల ముందు క్యూలో ఉంటాం. కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఆపిల్ దుకాణాల ముందు నిల్చుంటాం. క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం కిలోమీటర్ల వరకు క్యూ కట్టేస్తాం. ఈ మధ్యన బట్టలు కొనేందుకు కూడా షాపుల ముందు నించుంటున్నారు జనం. ఇక మద్యం దుకాణాల ముందు మందుబాబుల క్యూ ఎవర్‌గ్రీన్. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలో కనిపిస్తున్న క్యూ కూడా దాదాపు అలాంటిదే. కానీ డబ్బులిచ్చి కొనేందుకు కాదు.. ఫ్రీగా తినేందుకు. ఇంతకీ అక్కడ ఏం పెడుతున్నారు, అంత ఫేమస్సా?
ముంబై మహానగరంలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న అమ్మకై అనే రెస్టరెంట్ (AmmaKai Restaurant) ముందు జనం క్యూ కట్టిన వీడియోను ఎక్స్‌లో డీజీ పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. కొత్తగా ప్రారంభమైన అమ్మకై రెస్టరెంట్.. రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత అల్పహారం ఆఫర్ చేసింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ పెడతామని ప్రకటించింది. ముందుగా వచ్చిన వారికి మాత్రమే వడ్డిస్తామని షరతు పెట్టింది. ఇది చూసిన జనం రెస్టరెంట్ ముందు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు.
బిచ్చగాళ్ల మాదిరిగా..
ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన యూజర్.. జనం తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఉచితంగా అల్పాహారం పెడతామంటే జనం బిచ్చగాళ్ల మాదిరిగా రెస్ట్‌రెంట్ తెరవడానికి 2 గంటల ముందే క్యూ కట్టారని ఫైర్ అయ్యారు. లైనులో నిల్చున్న వారిని చూస్తే.. ఎవరూ పేదవారులా కనిపించలేదన్నారు. కనీసం రెండుమూడు కోట్ల రూపాయల విలువైన ఫ్లాట్లలో నివసిస్తున్న లక్షధికారుల్లా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్రీగా వస్తుందంటే చాలు వెనుకాముందు చూడకుండా ఎగేసుకుని వచ్చేస్తారంటూ నిష్టూరమాడారు. ఒక ప్లేట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం సిగ్గు లేకుండా రోడ్డుపై గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారని ధ్వజమెత్తారు. 'ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తున్నందుకు ప్రభుత్వాలను తప్పుబడతాం. కానీ దానికి మన బాధ్యత ఉందని అనుకోం. మన ఆలోచనలు మారకపోతే, దేశం ఇలాగే ఉంటుంద'ని ఎక్స్‌లో రాశారు. ఫ్రీగా వస్తుందంటే జనం ఇలాగే ఎగబడతారని నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.
అమ్మకైగా మారిన బాస్టియన్
ఇంతకీ అమ్మకై రెస్టరెంట్ ఎవరిదో తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిదే ఈ హోటల్. మూడేళ్ల క్రితం బాస్టియన్ బాంద్రా పేరుతో రంజిత్ బింద్రాతో కలిసి ఈ రెస్టరెంట్ ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్‌లో దీన్ని మూసివేస్తున్నట్టు ఎక్స్‌లో శిల్పా శెట్టి ప్రకటించారు. ఎందుకు మూసివేస్తున్నారనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. 60 కోట్ల మోసం కేసులో ఇరుక్కున్నందుకే శిల్పాశెట్టి ఈ హోటల్ మూసేస్తున్నారని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హెటల్‌ను కొత్తగా మార్చి అమ్మకై పేరుతో మళ్లీ ప్రారంభించారు. ప్రమోషన్ కోసం ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ ఆఫర్ (Free Breakfast Offer) పెట్టారని ముంబై జనం అనుకుంటున్నారు.
చదవండి: ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. అమ్మాయి ప్లాటయింది!
AmmaKai,a newly launched restaurant by Shilpa Shetty in Bandra announced free breakfast for anyone and everyone with first come first serve basis and this is how the people responded like absolute beggars,standing in que since 7.00 A.M in the morning,2 hours before the… pic.twitter.com/AAz8iqdcFU
— DG (@RetardedHurt) January 27, 2026


