ఏం ప్లాన్ చేశావ్ బ్రో.. సూప‌ర్బ్‌! | Biker Proposes To Girlfriend While Riding Motorcycle Video Viral | Sakshi
Sakshi News home page

బైక్‌ రైడ్‌ కాదు.. ‘లైఫ్‌’ రైడ్‌!

Jan 23 2026 2:50 PM | Updated on Jan 23 2026 2:53 PM

Biker Proposes To Girlfriend While Riding Motorcycle Video Viral

ప్రేమలో పడటం సులభమే కానీ.. ఆ ప్రేమను వ్యక్తపరచడమే ఒక పెద్ద టాస్క్‌! మన వీరేంద్ర కువేల్కర్‌ మాత్రం రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి, తన గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం ఒక అదిరిపోయే ‘బైక్‌ డ్రామా’ ప్లాన్‌ చేశాడు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

అసలేం జరిగింది? 
సాదాసీదాగా బైక్‌ మీద షికారు వెళ్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చాడు వీరేంద్ర. పాపం ఆ అమ్మాయి వెనకాల కూర్చుని ప్రశాంతంగా గాలి పీల్చుకుంటోంది. కానీ వీరేంద్ర మాత్రం అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ‘సిగ్నల్‌’ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. సీన్‌ కట్‌ చేస్తే.. ముందుగా ఒక బైకర్‌ వచ్చి ఓవర్‌టేక్‌ చేసి ముందు నిలబడ్డాడు. అతని టీషర్ట్‌ వెనకాల ‘విల్‌’అని ఉంది. వెంటనే రెండోవాడు వచ్చాడు.. అతని టీ షర్ట్‌పై ‘యూ’అని ఉంది. మరో ఇద్దరు తోడయ్యారు.. వారి టీ షర్టులపై ‘మ్యారీ’, ‘మి’అని ఉంది. అక్షరాలు కలిపి చదివితే.. టడడడాయ్‌! ‘విల్‌ యూ మ్యారీ మీ’.. అని ఒక గాలిలో తేలే ప్రపోజల్‌ సిద్ధమైంది. ఆ నలుగురు బైకర్లు వరుసగా కళ్లముందు వెళ్తుంటే, ఆ అమ్మాయి షాక్‌ నుంచి తేరుకుని నవ్వే లోపే.. మన హీరో వీరేంద్ర జేబులోంచి మెరిసే ఉంగరం తీసి ఆఫర్‌ ఇచ్చేశాడు! 

మాకూ ఇలాంటి గ్యాంగ్‌ కావాలి 
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా బైకర్స్‌ కమ్యూనిటీ అంతా ‘బ్రదర్‌హుడ్‌ అంటే ఇదీ!’అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘రింగు తెచ్చాడు.. దానికి థ్రిల్‌ కూడా అటాచ్‌ చేశాడు!’.. అని ఒకరు.. ‘ఆయన హ్యాపీ, ఆమె హ్యాపీ, బైకర్స్‌ అందరూ హ్యాపీ!’.. అని మరొకరు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ సెటప్‌లు లేకపోయినా.. నలుగురు దోస్తులు, రెండు లీటర్ల పెట్రోల్‌ ఉంటే చాలు, ఇలాంటి అందమైన జ్ఞాపకాలను సృష్టించవచ్చని ఈ జంట నిరూపించింది.

చ‌ద‌వండి: తెల్ల‌వారుజాము నుంచే క్యూ క‌డ‌తారు.. ఒక‌టి మాత్రమే అమ్ముతారు!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement