బరువు తగ్గడం ఇటీవల ట్రెండీగా మారింది. స్మార్ట్‌గా వయసు తక్కువగా కనిపిస్తే ఏదో ఘనకార్యం సాధించిన ఫీలింగ్ చాలామందిలో. ఆ క్రమంలో ఆరోగ్యకరమైన పద్ధతుల వైపుకి కాకుండా షార్ట్‌కట్‌ల జోలికి వెళ్లి అనారోగ్యం పాలు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఎలాగైతేనేం వెయిట్‌లాస్ అయ్యితే చాలు అనుకునేవాళ్లు ఉన్నారు. ఆ వింత ధోరణిలోంచి పుట్టుకొచ్చిందే ఈ డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్. దెయ్యం పేరుతో పిలిచే ఈ డైట్‌ప్లాన్ ఆరోగ్యానికి అసలు మంచిదేనా..? ఎవ్వరైనా పాటించారా..అంటే..
చైనాలోని హాంగ్‌జౌకు చెందిన 26 ఏళ్ల జియావోయు అనే మహిళ తన ప్రాణ స్నేహితురాలి వివాహం సమయానికి తగ్గడానికి ఈ డెవిల్ వెయిట్‌లాస్ ప్లాన్ ప్రయత్నించింది. జస్ట్ రెండు నెలల్లో దాదాపు 15 కిలోలు తగ్గాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రయత్నించింది. అయితే ప్రీడయాబెటిస్ బారినపడి ఇబ్బందులు కొనితెచ్చుకుంది. నిజానికి ఈ డైట్ వల్ల పోషకాహార లోపం, హర్మోన్ల అమసతుల్యత, పిత్తాశయ రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వుతాయినేది ఆరోగ్య నిపుణుల వాదన.
ఇక్కడ ఈ చైనా మహిళ జియావోయు ఈ వెయిట్‌లాస్ ప్లాన్‌తో తన స్నేహితురాలి వివాహానికి సరిగ్గా 50 కిలోల బరువు లక్ష్యానికి చేరుకుంది. అయితే తర్వితగతిన అలసట, తీవ్ర దాహం, ఆకలి, తలతిరగడం, గుండె దడ వంటి సమస్యలను ఎదుర్కొంది. ఆ వెయిట్‌లాస్ ప్లాన్‌లో భాగంగా చేసిన ఉపవాసల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని పరీక్షల్లో తేలింది. అధిక తీవ్రత వ్యాయామాలు చేస్తూ..పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగించిది. దాంతో ఇన్సులిన్‌పై ఎఫెక్ట్‌పడి ప్రీ డయాబెటిస్‌ని ఎదుర్కొనక తప్పలేదామెకు.
త్వరితగతిన బరువు తగ్గే వెయిట్‌లాస్ ప్లాన్ కండరాలు నష్టం, డీ హైడ్రషన్‌కి దారితీసి..చివరికి జీవక్రియను పూర్తిగా దెబ్బతీసింది. దెబ్బతో ఆ మహిళ వెంటనే ఆ డైట్ ప్లాన్‌కి స్వస్తి చెప్పి..తన జీవనశైలిలో మంచి మార్పులు చేసుకుంది. సమతుల్య ఆహారాన్ని స్వీకరించి, పరిమిత అధిక తీవ్రత వ్యాయామాలు లేదా ఏరోబిక్ వ్యాయమలు చేయడం ప్రారంభించింది. ఈ మార్పులతో ఆమె మూడు నెలల్లో 52.5 కిలోలు తగ్గింది. ఈ విధానంతో ఆమె మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు రావడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది.
'డెవిల్ వెయిట్-లాస్ ప్లాన్' అంటే..
ఇది సరైన డైట్ ప్లాన్ మాత్రం కాదు. స్వీయంగా రూపొందించిన డైట్ ప్లాన్. తీవ్రమైన వ్యాయామాలు, డైట్, పరిమిత కేలరీలతో కూడిన డైట్. అలాగే వేగంగా బరువు తగ్గడమే ధ్యేయంగా రూపొందించిన అనారోగ్యకరమైన డైట్.
ఇందులో ప్రధానమైన ఆహారాన్ని నివారించి, తీవ్రమైన వ్యాయమాలు చేసి సమస్యలు కొని తెచ్చుకుంటంటారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి వాటి వల్ల బరువు తగ్గడం ఎలా ఉన్నా..జీవక్రియ నష్టం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమే ఎక్కుగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వైద్యలు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.


