భాతర 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వేడుకలో తన వేషధారణతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో సిగ్నేచర్ టైలర్డ్ ప్యాంట్‌సూట్‌లకు పేరుగాంచిన ఈయూ చీఫ్ ఉర్సులా మెరూన్-అండ్-గోల్డ్ బ్రోకేడ్ బంద్‌గాలా విత్ ఆఫ్-వైట్ ప్యాంట్‌లో కనిపించారు. భారతీయ శైలిలో వచ్చి..ఈ వేడుకను మరింత అందంగా మార్చారామె. భారతీయ సంస్కృతిపట్ల గౌరవాన్ని, అలాగే ఈ వేడుక ప్రాముఖ్యతన ఉర్సులా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె.
సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియోలస్ శాంటోస్ డా కోస్టాతో కలిసి కర్తవ్య పథ్‌కు చేరుకోవడానికి కొన్ని క్షణాల ముందు, చీఫ్ ఉర్సులా సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉండటం అనేది తన జీవితకాల గౌరవం.
విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది. తద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం." అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ.
ఆమె జూలై 2024లో రెండవసారి ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. 2029లో జరిగే యూరోపియన్ ఎన్నికల వరకు కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. పైగా యూరోపియన్ కమిషన్‌లో తన పదవీకాలానికి ముందు, వాన్ డెర్ లేయెన్ 2005 నుంచి 2019 వరకు జర్మనీ సమాఖ్య ప్రభుత్వంలో పనిచేశారు. ఈ సమయంలో ఆమె కుటుంబం, యువజన, కార్మిక, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, పాలన, ప్రజా సేవలో విస్తృతమైన అనుభవాన్ని పొందారు.
77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
Prime Minister… pic.twitter.com/5Snpohoa5m— ANI (@ANI) January 26, 2026
(చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..)


