డైనమిక్‌ డీకోడర్‌ | Yamuna Krishnan is pioneering research in DNA nanotechnology | Sakshi
Sakshi News home page

డైనమిక్‌ డీకోడర్‌

Jan 28 2026 1:05 AM | Updated on Jan 28 2026 1:05 AM

Yamuna Krishnan is pioneering research in DNA nanotechnology

జీవశాస్త్రం అంతా తెలిసినట్లుగానే ఉంటుంది. ఏమీ తెలియనట్లుగా కూడా ఉంటుంది. ఈ దోబూచులాటలో సమాధానం దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఆ సమాధానాల కోసం వెయ్యి కళ్లతో, వెయ్యి ఆలోచనలతో నిరంతరం శోధిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలాంటి శాస్త్రవేత్తలలో యమున కృష్ణన్‌ ఒకరు. రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, వైద్యశాస్త్రాల మధ్య వారధిగా గుర్తింపు తెచ్చుకున్న యమున డీఎన్‌ఏ నానోటెక్‌తో మానవ కణాల లోపల దాగి ఉన్న రహస్యాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు...

జీవశాస్త్రంలో జవాబు దొరకని కొన్ని పెద్దప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. అవయవాలు, కణాజాలాలను అర్థం చేసుకోవడంలో ఆధునిక వైద్యం అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ, ప్రతికణాన్ని సజీవంగా ఉంచే ‘ఆర్గానెల్స్‌’ అని పిలిచే చిన్న కంపార్ట్‌మెంట్‌ లోపల ఏమి జరుగుతోందో అనేది శాస్త్రవేత్తలకు తెలిసింది తక్కువ. ఆ అదృశ్య ప్రపంచ రహస్యాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు డీఎన్‌ఏ ఆధారిత నానోటెక్నాలజీ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ శాస్త్రవేత్తలలో షికాగో యూనివర్శిటీలోనిప్రొఫెసర్‌ యమున కృష్ణన్‌ ఉన్నారు. జీవకణాల లోపల పనిచేయగల అల్ట్రా–స్మాల్‌ డీఎన్‌ఏ నానో పరికరాలను అభివృద్ధి చేశారు యమున.

లైసోసోమ్‌ను తట్టుకునేలా...
‘మనం జీవశాస్త్రానికి సంబంధించిన ఉపరితలాన్ని మాత్రమే చూస్తున్నాం. ఇప్పటికే ఉన్న చాలా మందులు కణం బయటి ΄÷రలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ ఉపరితలం మొత్తం ΄÷ర వ్యవస్థలో 2–5 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన అంతర్గత వ్యవస్థ ఇప్పటికీ సరిగ్గా అర్థం కాలేదు’ అంటున్నారు యమున.అధ్యయనం చేయడానికి అత్యంత సవాలు విసిరే కణాంగం (జీవకణాల లోపల నిర్దిష్టమైన పనులు నిర్వహించే చిన్న ప్రత్యేక నిర్మాణం)... లైసోసోమ్‌. 

ఇది వ్యర్థాలను తొలగించడంలో, సెల్యులార్‌ పదార్థాన్ని రీసైకిలింగ్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లైసోసోమ్‌ అనేది అల్జీమర్స్, పార్కిన్సన్స్‌ లాంటి న్యూరోడీజెనరేటివ్‌ రుగ్మతలతో ముడిపడి ఉంటుంది. దీనిలోని తీవ్రమైన రసాయన వ్యవస్థ సంప్రదాయ సెన్సింగ్‌ సాంకేతికతకు ప్రతికూలంగా మారి అంతరాయం కలిగిస్తుంది.

యమున బృందం దాదాపు 35 కిలోడాల్టన్‌ల బరువు ఉన్న చిన్న డీఎన్‌ఏ డ్యూప్లెక్స్‌లను రూపొందించింది. కఠినమైన లైసోసోమ్‌ వాతావరణాన్ని తట్టుకొని దానిలోని రసాయన అసమతుల్యతలను తెలుసుకోవడానికి ఇవి ఉపకరిస్తాయి.

ఒక వారధి
న్యూరో డీజెనరేటివ్‌ వ్యాధులను ముందుగానే గుర్తించడం చాలా కష్టం. డీఎన్‌ఏ ఆధారిత నానోడివైజ్‌ పరీక్షలు వ్యాధి లక్షణాలను చాలా ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి. నష్టాన్ని తగ్గించడానికి, మెరుగైన చికిత్స అందించడానికి వైద్యులకు వీలైనంత సమయాన్ని ఇస్తాయి. రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, వైద్యం మధ్య వారధిగా పనిచేస్తున్నారు యమున కృష్ణన్‌.

‘ఎస్యా ల్యాబ్స్‌’ పేరుతో ఒక బయోటెక్‌ స్టార్టప్‌ను స్థాపించారు యమున. తన ప్రయోగశాల ఆవిష్కరణలను రోగనిర్ధారణ సాధనాలుగా మార్చే స్టార్టప్‌ ఇది. మైఖేల్‌ జె.ఫాక్స్‌ ఫౌండేషన్, గేట్స్‌ ఫౌండేషన్‌ ఈ స్టార్టప్‌కు సహకారం అందిస్తున్నాయి.‘డీఎన్‌ఏ అనేది అత్యంతప్రాచీన భాష’ అంటారు యమున. ఆ భాషను ఉపయోగించి కణానికి సంబంధించిన లోతైన రహస్యాలను నానో పరికరాల సహాయంతో చేధించడానికి ప్రయత్నిస్తున్నారు యమున కృష్ణన్‌.

ప్రయోగాల బాటలో...
కేరళలోని పరప్పనంగడిలో పుట్టిన యమున చెన్నైలో పెరిగారు. చిన్నప్పుడెప్పుడో అప్పటి కామరాజ్‌ విశ్వవిద్యాలయం వైస్‌–ఛాన్స్‌లర్‌ అయిన ఎస్‌.కృష్ణస్వామి మాటలు విన్నారు. ఆ ప్రభావంతో శాస్త్రీయ విషయాలపై అమిత ఆసక్తి పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచే తన ఇంట్లో ఏవేవో ప్రయోగాలు చేస్తుండేవారు. చెన్నైలోని ఉమెన్స్‌ క్రిస్టియన్‌ కాలేజీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేసిన యమున కెమికల్‌ సైన్సెస్‌ లో మాస్టర్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశారు.

2001 నుంచి 2004 వరకు యూకేలోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలో. బెంగళూరులోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)లో అసోసియేట్‌ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2014లో షికాగో విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రప్రొఫెసర్‌గా చేరారు. న్యూక్లిక్‌ ఆమ్లాల నిర్మాణం, డైనమిక్స్‌. న్యూక్లిక్‌ యాసిడ్, నానోటెక్నాలజీ, సెల్యులార్, సబ్‌ సెల్యులార్‌ టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.

అలా...అనుకోకుండా!
చిన్నప్పుడు మా ఇంటి వంటగది, తోట నా ప్రయోగశాలలు. వంటగది కత్తులు కూడా నా ప్రయోగాలలో భాగమే! పువ్వులు, కప్పలపై ప్రయోగాలు చేసేదాన్ని! సైన్స్‌ అంటే ఉత్సాహం ఉండే వ్యక్తులతో మాట్లాడడం, కలిసి పనిచేయడం నాకు ఇష్టం. జీవశాస్త్ర విస్తృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, సందేహాలకు సమాధానాలు అన్వేషించడం నాకు చాలా ఇష్టం. మొదట్లో ఏమీ తెలియకపోయినా అమితమైన ఆసక్తితో ఒక్కో విషయాన్ని నేర్చుకుంటూ శాస్త్రవేత్తలుగా మారిన వారు అంటే ఇష్టం.
నేను కెమిస్ట్రీలోకి రావడం అనుకోకుండా జరిగింది. ఆర్కిటెక్చర్‌ చేయాలనుకున్నాను. కానీ ఒక కీలకమైన పరీక్షలో ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరడానికి సరిపడా మార్కులు రాకపోవడంతో కెమిస్ట్రీలోకి రావలసి వచ్చింది. ఆర్కిటెక్చర్‌ చేయనందుకు చాలా సంతోషిస్తున్నాను! – యమున కృష్ణన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement