
ఏదైనా సవ్యంగా చేస్తే అందరికీ నచ్చుతుంది, పైగా ప్రశంసలు అందుకుంటారు. అందులోనూ విలువలు, సంస్కృతుల జోలికి వెళ్లకూడదు. వాటిపై అవగాహన ఏర్పరుచుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే..విమర్శలు, చివాట్లు తప్పవు. ఇక్కడొక రష్యాన్ అమ్మాయి అలాంటి పనిచేసే విమర్శలపాలైంది.
రష్యన్ మహిళ మోనికా కబీర్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ టర్కీలో బాగా రద్దీగా ఉండే రహదారిపై అందరూ చూస్తుండగానే చీర మార్చుకుంటుంది. అయితే కొందరూ ఆమె ఏం చేస్తుందని ఆతృతగా చూడగా. మరికొందరూ ఫన్నీగా జోక్‌లు వేసుకుంటూ ఆటపట్టిస్తున్నట్లుగా చూశారు. ఆమె అలా బహిరంగంగానే చీర కట్టుకోవడాన్ని పబ్లిక్ షోలాగా ప్రదర్శించడం తట్టుకోలేక ఓ సెక్యూరిటీ గార్డు వచ్చి ఇది మంచి పద్ధతి కాదని, బహిరంగ ప్రదేశాల్లో సరైన కాదని ఆమెకు హితవు పలుకుతాడు.
ఆ మహిళ ఈ వీడియోకి 'నమస్తే టర్కీ' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట పోస్ట్ చేసింది. చక్కగా ఎర్రటి చీరలో అందంగా కనిపించినప్పటికీ..ఆమె మసులకున్న తీరు నెటిజన్లకు ఆగ్రహాం తెప్పించింది. చీర ధరించాలనుకోవడం వరకు కరెక్టే..కానీ ఇలా చేయడం పద్ధతి కాదు.
భారతీయతకు చిహ్నమైన చీరను, దాని సంస్కృతిని అవమానిస్తున్నట్లుగా ఉంది నీ ప్రవర్తన అని మండిపడుతూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. ఇక ఈ ఇన్‌ఫుయెన్సర్ స్వతహాగా ఢాకా నివాసి అని, ఇటీవలే టర్కీ సందర్మించనప్పడూ ఈ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం.
(చదవండి: అక్కడ అంతటి గౌరవమా..! భారత సంతతి మహిళ అనుభవం)